బీసీసీఐ తాత్కాలిక సెక్రెటరీగా దేవజిత్ సైకియా

by Harish |
బీసీసీఐ తాత్కాలిక సెక్రెటరీగా దేవజిత్ సైకియా
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ తాత్కాలిక సెక్రెటరీగా జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియాను అధ్యక్షుడు రోజర్ బిన్నీ నియమించారు. జై షా ఇటీవల ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ సెక్రెటరీ పదవి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తన స్పెషల్ పవర్స్ ఉపయోగించి దేవజిత్ సైకియాకు తాత్కాలికంగా సెక్రెటరీ బాధ్యతలు అప్పగించారు. బీసీసీఐ రాజ్యాంగంలోని ఆర్టికల్ 7.2(డి) ప్రకారం.. ఆఫీస్ బేరర్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యానికి గురైనప్పుడు మరొక ఆఫీస్ బేరర్‌కు విధులను అప్పగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. సైకియా ఎప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉంటారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఈ నెల 5న జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో బీసీసీఐ తరపున సైకియా ప్రాతినిధ్యం వహించారు.

Next Story

Most Viewed