- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో బింద్యారాణికి రజతం
జింజు : సౌత్ కొరియాలో జరుగుతున్న ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ శనివారం ఖాతా తెరిచింది. మహిళా వెయిట్‌లిఫ్టర్ బింద్యారాణి 55 కేజీల కేటగిరీలో రజతం సాధించింది. మొత్తంగా 194 కేజీలు ఎత్తిన ఆమె రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 83 కిలోల బరువులు ఎత్తిన బింద్యారాణి.. క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు పైకెత్తింది. క్లీన్ అండ్ జర్క్ విభాగంలో కూడా ఆమె రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో బింద్యారాణి రజతం సాధించిన విషయం తెలిసిందే. 55 కేజీల కేటగిరీలో చైనాకు చెందిన చెన్ గువాన్ లింగ్(204 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా.. వియత్నం వెయిట్‌లిఫ్టర్ వో థి క్విన్ న్హు(192 కేజీలు) కాంస్యం సాధించింది. శుక్రవారం 49 కేజీల కేటగిరీలో స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 194 కేజీలు ఎత్తి 5వ స్థానంతో సరిపెట్టుకుంది.