- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిల్లీ జీన్ కింగ్ కప్‌లో భారత్ జోరు
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టెన్నిస్ టోర్నీలో ప్లే ఆఫ్స్‌కు భారత జట్టు అడుగు దూరంలో నిలిచింది. ఆసియా/ఒషియానియా గ్రూపు-1లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్ కొరియాపై 1-2 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ గ్రూపులో రెండో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్‌లో రుతుజ 6-2, 6-2 తేడాతో సోహ్యున్ పార్క్‌పై నెగ్గి జట్టుకు శుభారంభం అందించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో అంకిత రైనా 2-6, 3-6 తేడాతో సుజియోంగ్ జంగ్ చేతిలో ఓడటంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా-ప్రార్థన జోడీ 6-4, 6-4 తేడాతో డాబిన్ కిమ్- సోహ్యున్ పార్క్ జోడీని ఓడించడంతో భారత్ విజయం లాంఛనమైంది. శనివారం చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుంది.