- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL 2024: ఉప్పల్ స్టేడియంకు అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డు
దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎల్-17 సీజన్ అత్యుత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డు ఉప్పల్ స్టేడియాన్ని వరించింది. ఆదివారం చెన్నైలో జరిగిన ఐపీఎల్ ముగింపు వేడుకల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఈ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డుతో పాటు హెచ్‌సీఏకు రూ.50 లక్షల నగదు బహుమతిని కూడా ఐపీఎల్ నిర్వాహకులు అందించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు కార్యదర్శి దేవ్‌రాజ్‌తో పాటు ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, హెచ్‌సీఏ సిబ్బంది అహర్నిశలు శ్రమించారని చెప్పారు. ముఖ్యంగా చీఫ్ క్యురేటర్ చంద్రశేఖర్, ఇతర గ్రౌండ్సమన్ సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కితాబు ఇచ్చారు. ఈ అవార్డు హెచ్‌సీఏ కుటుంబ సభ్యులందరి కష్టానికి ప్రతిఫలమని జగన్‌మోహన్ రావు అన్నారు.