- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ben Stokes : బెన్‌స్టోక్స్ యూటర్న్.. వన్డే రిటైర్మెంట్ వెనక్కి..
న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ యూటర్న్ తీసుకున్నాడు. గతేడాది వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను.. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. భారతగడ్డపై జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకే స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం ప్రపంచ కప్ కోసం తమ ప్రాథమిక జట్టును ఎంపిక చేసింది. జోస్ బట్లర్ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టు ప్రకటించింది.
ఈ జట్టులో బెన్ స్టోక్స్ చోటు దక్కింది. అయితే, పేసర్ జోఫ్రా ఆర్చర్‌తోపాటు టెస్టుల్లో సత్తాచాటుతున్న యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేయలేదు. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ప్రాథమిక జట్టుతోనే ఇంగ్లాండ్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. దాంతో ప్రపంచకప్‌కు ముందే బెన్ స్టోక్స్ కివీస్‌తో వన్డే సిరీస్ ఆడనున్నాడు. హోమ్ సిరీస్‌లో భాగంగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 15 మధ్య న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ నాలుగు టీ20లు, నాలుగు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టును కూడా ఈసీబీ ప్రకటించింది.
ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ ప్రాథమిక జట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, బెయిర్‌స్టో, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్.