- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సొంతగడ్డపై తేలిపోయిన తెలుగు టైటాన్స్
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సొంతగడ్డపైనైనా ఆట తీరు మారుతుందేమో అనుకుంటే మళ్లీ అదే వైఫల్యం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ చేతిలో 42-26 తేడాతో టైటాన్స్ చిత్తుగా ఓడింది. కెప్టెన్ పవన్ 7 పాయింట్లతో రాణించగా.. మిగతా ఆటగాళ్లు తేలిపోవడంతో ఓటమి తప్పలేదు. అయితే, మ్యాచ్‌లో మొదట ఆధిపత్యం టైటాన్స్‌దే. ఫస్టాఫ్‌లో ఆ జట్టు 12-9తో ఆధిక్యంలో నిలిచింది. కానీ, సెకండాఫ్‌లో పట్టు కోల్పోయి బెంగళూరుకు అవకాశాలు ఇచ్చింది. దూకుడుగా ఆడిన బెంగళూరు ఆటగాళ్లు మూడు సార్లు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. మరోవైపు, పాయింట్లు తేవడంలో తేలిపోయిన టైటాన్స్ మ్యాచ్‌ను బెంగళూరుకు సమర్పించుకుంది. బెంగళూరు జట్టులో అక్షిత్ 9 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 7 పాయింట్లు, వికాస్ 6 పాయింట్లతో రాణించారు. తెలుగు టైటాన్స్‌కు ఇది వరుసగా ఇది ఏడో పరాజయం. మొత్తంగా 12వ ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున కొనసాగుతోంది. మరోవైపు, పాట్నా పైరేట్స్ నాలుగు మ్యాచ్‌ల తర్వాత విజయాన్ని అందుకుంది. యూపీ యోధాస్‌పై 31-34 తేడాతో విజయం సాధించింది.