Ben Stokes: చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా..

by Vinod kumar |   ( Updated:2023-09-15 14:39:36.0  )
Ben Stokes: చరిత్ర సృష్టించిన బెన్‌ స్టోక్స్‌.. ప్రపంచంలోనే రెండో క్రికెటర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ చరిత్ర సృష్టించాడు. విధ్వంసకర శతకంతో చెలరేగి పలు అరుదైన ఘనతలు సాధించాడు. ఈ క్రమంలో.. మూడో వన్డేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్లతో 182 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో నాలుగో సెంచరీ చేసిన స్టోక్సీ.. ఈ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఈ క్రమంలో జేసన్‌ రాయ్‌ (180; 2018లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న ఈ రికార్డును స్టోక్స్‌ బద్దలు కొట్టాడు. అదే విధంగా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానంలో వచ్చి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ తర్వాత ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో రాస్‌ టేలర్‌, ఏబీ డివిలియర్స్‌, టీమిండియా లెజెండ్‌ కపిల్‌ దేవ్‌లను అధిగమించాడు. ఇదిలా ఉంటే మూడో వన్డేలో ఇంగ్లండ్‌ 181 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

వన్డేల్లో నాలుగు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన టాప్‌-5 క్రికెటర్లు వీరే..

వివియన్‌ రిచర్డ్స్‌- 189

బెన్‌ స్టోక్స్‌- 182

వివియర్‌ రిచర్డ్స్‌- 181

రాస్‌ టేలర్‌- 181

ఏబీ డివిలియర్స్‌- 176

కపిల్‌ దేవ్‌- 175

Advertisement

Next Story

Most Viewed