- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై జట్టుకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు బెన్ స్టోక్స్ రెడీ..
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో బెన్ స్టోక్స్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఆడుతాడా లేదా అనే దానిపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. ఈ సిరీస్‌లో మోకాలి గాయంతో స్టోక్స్ బాధపడ్డాడు. దీనిపై స్పందించాడు బెన్ స్టోక్స్.. అయితే మోకాలి గాయం వేధిస్తున్నా తాను కచ్చితంగా ఐపీఎల్‌ల్లో ఆడతానని రెండో టెస్టు తర్వాత బెన్ స్టోక్స్ చెప్పడం గమనార్హం.
ఈ విషయం పై నేను ఫిజియోలు, మెడికోలతో కలిసి పని చేస్తున్నాను. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తున్నాను. యాషెస్ సిరీస్‌కు మరో నాలుగు నెలల సమయం ఉంది. ఆ సమయానికి పూర్తి సామర్థ్యంతో ఆడటానికి చేయాల్సినవన్నీ చేస్తానని స్టోక్స్ స్పష్టం చేశాడు. ఈ రెండో టెస్టులో స్టోక్స్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయగా.. అటు బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ అతడు మోకాలి గాయంతో బాధపడ్డాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో 27, రెండో ఇన్నింగ్స్ లో 33 పరుగులు చేశాడు. చెన్నై జట్టు గత వేలంలో అతన్ని ఏకంగా రూ.16. 25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ సీజన్ ఐపీఎల్ జరగనున్నది.