BCCI : ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. రూ. 8.5 కోట్లు ప్రకటించిన జై షా

by Harish |
BCCI : ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు.. రూ. 8.5 కోట్లు ప్రకటించిన జై షా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లకు బీసీసీఐ మద్దతుగా నిలిచింది. ఆర్థిక సహాయంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ)కు రూ.8.5 కోట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆదివారం వెల్లడించారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన అద్భుతమైన అథ్లెట్లకు బీసీసీఐ మద్దతు ఇస్తుందని చెప్పడానికి గర్వంగా ఉంది. ఒలింపిక్స్ క్యాంపెయినింగ్ కోసం బీసీసీఐ తరపున రూ. 8.5 కోట్లు ఐవోఏకు అందిస్తున్నాం. భారత బృందానికి శుభాకాంక్షలు. భారత్ గర్వపడేలా చేయండి. జై హింద్.’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా, ఈ నెల 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఈ విశ్వక్రీడల్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొంటున్నారు.



Next Story