టీమ్ ఇండియా హోం సీజన్‌ షెడ్యూల్‌లో మార్పులు

by Harish |
టీమ్ ఇండియా హోం సీజన్‌ షెడ్యూల్‌లో మార్పులు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హోం సీజన్ షెడ్యూల్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. రివైజ్డ్ షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం రిలీజ్ చేసింది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20, ఇంగ్లాండ్‌తో రెండు టీ20ల వేదికలను మార్చినట్టు బోర్డు తెలిపింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 20 వరకు బంగ్లాతో భారత్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 6న జరిగే తొలి టీ20 వేదికను ధర్మశాల నుంచి గ్వాలియర్‌ మార్చింది. హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ధర్మశాల స్టేడియంలోని డ్రెస్సింగ్ రూంల్లో అప్‌గ్రేడ్, రెనోవేషన్ పనులు చేపట్టడం కారణంగా వేదికను గ్వాలియర్‌కు మార్చినట్టు బోర్డు పేర్కొంది.

అలాగే, ఇంగ్లాండ్‌తో తొలి రెండు టీ20 వేదికలు కూడా మారాయి. చెన్నయ్ వేదికగా నిర్వహించాల్సిన మొదటి మ్యాచ్‌ను కోల్‌కతాకు మార్చగా.. కోల్‌కతాలో జరగాల్సిన రెండో టీ20ని చెన్నయ్‌లో నిర్వహించనున్నారు. మ్యాచ్‌ల తేదీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వచ్చే ఏడాది జనవరి 22న తొలి టీ20, 25న రెండో మ్యాచ్ జరగనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెట్ అసోసియేసన్ ఆఫ్ బెంగాల్‌కు కోల్‌కతా పోలీసులు చేసిన అభ్యర్థన మేరకు వేదికను మార్చారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఇంగ్లాండ్‌తో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

Advertisement

Next Story

Most Viewed