- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత ప్లేయర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన బీసీసీఐ
దిశ, వెబ్‌డెస్క్: వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న భారత ప్లేయర్లకు బీసీసీఐ అదిరిపోయో ఆఫర్‌ను ప్రకటించింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 4-1 తేడాతో సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో బీసీసీఐ.. టెస్ట్ మ్యాచ్ ఫీజులను భారీగా పెంచింది. ఇప్పటివరకు ప్లేయర్లకు ఒక్క టెస్ట్‌కు రూ.15 లక్షలు ఫీజును చెల్లిస్తుంది. దీనిని ఏకంగా రూ. 45 లక్షలకు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ టెస్ట్ మ్యాచ్ ఫీజుకు కొన్ని నిబంధనలు కూడా పెట్టింది.
ఒక సంవత్సరంలో 75 శాతం కంటే ఎక్కువ గేమ్స్ ఆడిన ప్లేయర్ కి మ్యాచ్ కు రూ. 45 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అలాగే 50 శాతం మ్యాచులు ఆడిన ప్లేయర్ లకు రూ. 30 లక్షలు, అలాగే టెస్టు మ్యాచ్ లో స్థానం దక్కినప్పటికి తుది జట్టులో స్థానం దక్కని వారికి రూ. 22.5 లక్షలు, 15 లక్షలు టెస్ట్ మ్యాచ్ ఫీజుగా చల్చిస్తామని బీసీసీఐ ప్రకటించింది. కాగా దీనిపై భారత మాజీ ప్లేయర్, ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్ననని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్లేయర్ల పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. అలాగే మంచి నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జై షాని గంభీర్ అభినందించారు.