రాహుల్ ద్రావిడ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..

by Vinod kumar |
రాహుల్ ద్రావిడ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతనితోపాటు ఇతర సహాయ సిబ్బంది కాంట్రాక్టులను పొడిగిస్తూ బుధవారం (నవంబర్ 29) బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఆ పదవిలో కొనసాగిన రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టును బీసీసీఐ పొడిగింది. వరల్డ్ కప్ ఫైనల్‌తో ద్రవిడ్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత అతనితో చర్చలు జరిపి దీనిని పొడిగించాలని నిర్ణయించినట్లు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కూడా కొనసాగనున్నారు. అయితే ద్రవిడ్ ఎన్నాళ్లు ఆ పదవిలో కొనసాగనున్నాడన్నది మాత్రం బోర్డు వెల్లడించలేదు. ఇది కనీసం వచ్చే ఏడాది జూన్, జులైలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ వరకైనా ఉంటుందని భావిస్తున్నారు. నవంబర్, 2021లో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాడు. రెండేళ్లపాటు అతనితో బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

Next Story

Most Viewed