కన్నీళ్లు పెట్టుకున్న బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా.. అసలు ఏం జరిగిందంటే?

by Shiva |
కన్నీళ్లు పెట్టుకున్న బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఒకప్పుడు అరివీర భయంకర బౌలర్లను సైతం తన బ్యాటింగ్‌తో ఓ ఆట ఆడుకున్న బ్రియాన్ లారా చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. అవును మీరు నిజమే అతను నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు అతను కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో అతిథ్య జట్టు ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో టెస్ట్‌ బిస్బేన్‌కు వచ్చేసరికి సీన్ తారుమారైంది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 311 పరుగులకు అలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 289 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 193 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసిస్ ముందు 216 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అనంతరం చివరి రోజు బ్యాటింగ్ దిగిన ఆసిస్ 207 పరుగులకు ఆలౌటైంది. దీంతో విండీస్ ఎనమిది పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో 27 ఏళ్ల నిరీక్షణ అనంతరం బ్రిస్బేన్ వేదికగా టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ జట్టు చారిత్రకవిజయం సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్‌కు కామెంటేటర్‌‌గా వ్యవహరించిన లెజెండరీ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లతో కూడిన భారమైన హృదయంతో లారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ’ఇది నాకు నమ్మశక్యంగా లేదు.. 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం నిజంగా అద్భుతం. అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో కూడిన జట్టు నేడు అత్యున్నత స్థాయికి చేరింది. వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఇదో గొప్ప రోజు’ అంటూ పక్కే ఉన్న ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆనందంతో కౌగిలించుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed