- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్ అంత ఈజీ కాదు : రోహిత్ శర్మ
లండన్: ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులు బ్యాటర్లకు ఎప్పుడూ సవాలు విసిరుతూనే ఉంటాయని, బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు సోమవారం ఐసీసీ నిర్వహించిన షోలో పాల్గొన్న రోహిత్ పలు విషయాలు వెల్లడించాడు. ఇంగ్లాండ్‌లో సులభంగా పరుగులు రాబట్టలేమని, ముఖ్యంగా ముందుగా బ్యాటింగ్ ప్రారంభించడం అంత తేలిక కాదన్నాడు.
‘ఇంగ్లాండ్‌లో పరిస్థితులు సవాలుగా మారుతుంటాయి. బ్యాటర్లు ఏకాగ్రత, ఓర్పుతో బ్యాటింగ్ చేసే ఫలితాలు సాధించవచ్చు. అలాగే, సమయం వచ్చినప్పుడు బౌలర్లపై ఎదురుదాడికి దిగడానికి కూడా సిద్ధంగా ఉండాలి.’ అని తెలిపాడు. ‘ఈ పిచ్‌లపై రాణించిన వాళ్లను చాలా మందిని చూశాను. వాళ్లు పరుగులు ఎలా చేస్తున్నారో గమనించేవాన్ని. కానీ, వారిని నేను అనుకరించను. కానీ, వాళ్లు ఏ విధంగా రన్స్ రాబట్టారో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, 2021లో ఓవల్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో రోహిత్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.