- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండోది బంగ్లాదే.. శ్రీలంక చిత్తు
దిశ, స్పోర్ట్స్: ఆతిథ్య జట్టు శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 1-1తో సమం చేసింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కామిండు మెండిస్ చేసిన 37పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధికం కావడం గమనార్హం. బ్యాటింగ్‌లో ఏ ఒక్కరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు.. 18.1ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 170 పరుగులు చేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సెయిన్ అర్ధసెంచరీ(53*)తో అదరగొట్టాడు. శ్రీలంక బౌలర్లలో మథీశా పత్తిరాణా ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. బంగ్లా బౌలర్లలో తాస్కిన్ అహ్మద్, మహెది హసన్, ముస్తఫిజుర్, సౌమ్య సర్కార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను బంగ్లా 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టీ20 ఈ నెల 9న జరగనుంది.