ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు భారత జట్లు అర్హత

by Harish |
ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు భారత జట్లు అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : మలేషియాలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గురువారం తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు సాధించాయి. పురుషుల టీమ్ విభాగంలో గ్రూపు-ఏ తొలి మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో హాంకాంగ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్‌లో భారత్‌కు షాక్ తగిలింది. సింగిల్స్ మ్యా్చ్‌లో ప్రణయ్ 18-21, 14-21 తేడాతో ఎన్జీ కా లాంగ్ చేతిలో ఓడిపోయాడు. యాడు. అనంతరం డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ, సింగిల్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ గెలుపొందడంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక, మరో డబుల్స్ మ్యాచ్‌లో అర్జున్-ధ్రువ్ కపిల జోడీ 21-12, 21-7 తేడాతో చౌ హిన్ లాంగ్-హంగ్ కుయ్ చున్‌పై విజయం సాధించడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఇక, చివరిదైన నామమాత్రపు సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-14, 21-18 తేడాతో జాసన్ గుణవన్‌‌ను ఓడించాడు. నేడు చివరి గ్రూపు మ్యాచ్‌లో చైనాతో భారత జట్టు తలపడనుంది.

చైనాపై మహిళల జట్టు అద్భుత విజయం

గ్రూపు-డబ్ల్యూలో భారత మహిళల జట్టు అద్భుత విజయం అందుకుంది. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో చైనాను 2-3 తేడాతో ఓడించింది. గాయం కారణంగా చాలా రోజులపాటు ఆటకు దూరంగా ఉన్న పీవీ సింధు విజయంతో పునరామగనం చేసింది. తొలి మ్యాచ్‌లో సింధు 21-17, 21-15 తేడాతో హన్ యూను ఓడించి భారత్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జోడీ, సింగిల్స్‌లో అష్మిత ఓడిపోవడంతో భారత్ 1-2తో వెనుకబడింది. ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో ట్రీసా జాలీ-గాయత్రి జోడీ డబుల్స్ విజయం సాధించి జట్టును పోటీలోకి తెచ్చింది. లి యి జింగ్-లవో జు మిన్ జంటపై 21-10, 18-21, 17-21 తేడాతో భారత జోడీ నెగ్గి స్కోరును 2-2తో సమం చేశారు. ఇక, భారత్ విజయం నిర్ణయాత్మక చివరి గేమ్‌పై ఆధారపడగా 17 ఏళ్ల అన్మోల్ ఖరాబ్‌ సంచలన ప్రదర్శన చేసింది. చివరి మ్యాచ్‌లో వు లుయో యు‌ను 220-22, 21-14, 18-21 తేడాతో చిత్తు చేసిన అన్మోల్ భారత్ గెలుపు‌ను లాంఛనం చేసింది. గ్రూపు-డబ్ల్యూలో రెండు జట్లే ఉండటంతో భారత్‌కు నాకౌట్ బెర్త్ ముందే ఖాయమైంది. అయితే, చైనాను చిత్తు చేయడం ద్వారా భారత జట్టు గ్రూపులో టాప్ పొజిషన్‌లో నిలువడంతోపాటు అధికారికంగా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

Advertisement

Next Story