రేపు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడిపోబోతోంది.. బాబా జోస్యం

by Gantepaka Srikanth |
రేపు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడిపోబోతోంది.. బాబా జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా ఇండియా(India), పాకిస్తా్న్(Pakistan) మధ్య జరిగే మ్యాచ్‌ కోసం ఇరు దేశాల క్రికెట్ లవర్సే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌ గెలవాలని పలుచోట్లు పూజలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఓ బాబా హాట్ కామెంట్స్ చేశారు. మహా కుంభమేళాలో ఐఐటీ బాబా(IIT Baba)గా వైరల్ అయిన అభయ్ సింగ్(Abhay Singh) రేపు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ అస్సలు గెలవదు అని జోస్యం చెప్పారు. పాకిస్తాన్ గెలవడానికే అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు టీమిండియా ఫ్యాన్స్‌కు కోపం తెప్పిస్తున్నాయి. పాక్ గెలుపును కోరుకునే వారు భారత్‌లో ఉండేందుకు అర్హులు కాదని సోషల్ మీడియా వేదికగా పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు.


దుబాయ్ వేదికగా రేపు(23-02-2025) ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇండియా కంటే పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్తాన్ ఇక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ మాత్రం న్యూజిలాండ్‌తో ఓటమి కారణంగా చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.

పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా, కమ్రాన్ గులాం, తయ్యబ్ తాహిర్, ఖుఫ్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు.

Next Story