- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియాకు మరో షాక్.. తొలి టెస్టుకు కీలక బౌలర్ ఔట్..!
దిశ, వెబ్‌డెస్క్: భారత్ జట్టుతో ఆసీస్ నాలుగు టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు నాగ్‌పూర్ వేదికగా జరుగుతుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ప్రధాన బౌలర్ కెమెరూన్ గ్రీన్ దూరమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ జట్టు బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తొలిటెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. కెమెరూన్ కూడా తొలి టెస్టులో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్మిత్ చెప్పాడు.
కెమెరూన్ ఆడే విషయం పై స్మిత్ మాట్లాడుతూ.. నాగ్‌పూర్ టెస్టులో ఆడేందుకు కెమెరూన్ గ్రీన్కు ఇబ్బందిగా ఉందన్నాడు. గ్రీన్ నెట్స్‌లో ప్రాక్టీస్‌లో కూడా పాల్గొనలేదని, ఈ క్రమంలో తొలి టెస్టుకు అతను దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు. మ్యాచ్ ప్రారంభ సమయం వరకు వేచిచూస్తామని, గ్రీన్ మ్యాచ్‌కు అన్నివిధాల సిద్ధమైతే తుది జట్టులో ఎంపిక చేస్తామని, లేకుంటే విశ్రాంతి ఇస్తామని స్మిత్ చెప్పాడు.
భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ల తేదీలు..
1వ టెస్ట్ – ఫిబ్రవరి 9 నుండి 13 వరకు (నాగ్‌పూర్)
2వ టెస్ట్ – ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు (ఢిల్లీ)
3వ టెస్ట్ – మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు (ధర్మశాల)
4వ టెస్ట్ – మార్చి 9 నుంచి 13 వ తేదీ వరకు (అహ్మదాబాద్)
- Tags
- Cameron Green