- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరాట్ కోహ్లీ సక్సెస్‌కు ముఖ్య కారణం అదే: హాజెల్‌వుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హాజెల్‌వుడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ వెరీ టాలెంటెండ్ ప్లేయరని.. 35 ఏళ్ల వయస్సులో కూడా అతడు నిలకడగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. క్రికెట్‌లో కోహ్లీ ఇంత సక్సెస్ కావడానికి అతడి హార్డ్ వర్కే ముఖ్య కారణమని హాజెల్‌వుడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కోహ్లీ ఫిట్ నెస్, స్కిల్స్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అసాధారణమని కొనియాడాడు. కోహ్లీ నిలకడగా పరుగులు చేస్తూ సక్సెస్ కావడానికి ఎంతో కష్టపడతాడని తెలిపారు. ఫిట్ నెస్‌పై విరాట్ కోహ్లీ స్పెషల్ ఫోకస్ పెడుతాడని పేర్కొన్నారు. స్టార్ ప్లేయర్ అయినప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌కు గ్రౌండ్‌కు అందరికంటే ముందే వచ్చి.. అందరికంటే లాస్ట్ వెళ్తాడని హాజెల్‌వుడ్ తెలిపాడు. అంతేకాకుండా ప్రాక్టీస్‌లో విరాట్ హార్డ్ వర్క్ చేస్తాడని.. ఈ విషయాన్ని కోహ్లీ నుండి ఇతర ప్లేయర్స్ నేర్చుకోవాలన్నారు.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుఫున కోహ్లీ, హాజెల్‌వుడ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్లలో కోహ్లీతో కలిసి పాల్గొన్న హాజెల్‌వుడ్ అతడిని దగ్గరుండి చూశాడు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి ఆర్సీబీ కీలకమైన ప్లే ఆఫ్స్ ముంగిట ఓటమి పాలై ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడకుండానే వెనుదిరిగింది.
ఈ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 7 మ్యాచుల్లో గెలిచి మరో 7 మ్యాచుల్లో ఓడిపోయింది. 14 పాయింట్లు సాధించి.. ఐదవ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు ఆర్సీబీలో కలిసి ఆడిన విరాట్, హాజెల్‌వుడ్ ఈ నెల 7వ తేదీన ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు.