- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. రోహిత్ రికార్డు సమం
దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆదివారం అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అతను మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆసిస్ 34 పరుగుల తేడాతో కరేబియన్ జట్టును ఓడించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన కంగారుల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 241 పరుగులు చేసింది. ఆసిస్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించినప్పటికీ 64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్ బౌలర్లను ఊచకోత కోసిన అతను 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతనికిది ఐదో టీ20 శతకం. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డు కలిగిన రోహిత్ శర్మ సరసన నిలిచాడు. టిమ్ డేవిడ్(31 నాటౌట్)తో కలిసి ఆఖర్లో మ్యాక్స్‌వెల్ మరింత చెలరేగాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్‌లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అనంతరం 242 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ పోరాడి ఓడింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 207 పరుగులకే పరిమితమైంది. ఆసిస్ బౌలర్లు ఆరంభంలో వరుస వికెట్లతో కరేబియన్ జట్టును కష్టాల్లోకి నెట్టారు. 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ పొవెల్(63) పోరాటంతో ఆ జట్టు పుంజుకుంది. అతనితోపాటు రస్సెల్(37), జాసన్ హోల్డర్(28 నాటౌట్) చిన్నపాటి మెరుపులు మెరిపించారు. అయితే, లక్ష్యం పెద్దది కావడం, ఆసిస్ బౌలర్లు కట్టడి చేయడంతో విండీస్‌కు ఓటమి తప్పలేదు. ఆసిస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లు, హాజెల్‌వుడ్, జాన్సన్ చెరో రెండు వికెట్లతో రాణించారు. ఈ విజయంతో సిరీస్ ఆసిస్ కైవసమవ్వగా.. మూడో టీ20 నామమాత్రమే కానుంది. ఈ నెల 13న ఆఖరి టీ20 జరగనుంది.