భారత్, ఆసీస్ మహిళల ఏకైక టెస్టుకు వాంఖడే ఆతిథ్యం!

by Vinod kumar |
భారత్, ఆసీస్ మహిళల ఏకైక టెస్టుకు వాంఖడే ఆతిథ్యం!
X

న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్‌లో ఆసిస్ మహిళల జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించనున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. సదరు మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. మల్టీ ఫార్మాట్ సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు వన్డే, టీ20 మ్యాచ్‌లతోపాటు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఇరు జట్లు చివరిసారిగా 2021లో గోల్డ్ కోస్ట్ వేదికగా తొలి పింక్ బాల్ టెస్టు ఆడాయి. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోవైపు, భారత్ చివరిసారిగా 2014లో మహిళల టెస్టుకు ఆతిథ్యమిచ్చింది.

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఏకైక టెస్టు జరగగా.. ఇండియా విజయం సాధించింది. అలాగే, ఆస్ట్రేలియా మహిళల జట్టు చివరిసారిగా 1984లో భారత్‌లో టెస్టు మ్యాచ్ ఆడగా.. 39 ఏళ్ల తర్వాత మళ్లీ టెస్టు కోసం ఇండియాకు రానుంది. అలాగే, 9ఏళ్ల తర్వాత భారత్ మహిళల టెస్టుకు ఆతిథ్యమివ్వబోతున్నది. ఈ సిరీస్ మొత్తం ముంబై వేదికగానే జరగనున్నట్టు సదరు మీడియా సంస్థ పేర్కొంది. దీనిపై బీసీసీఐ‌గానీ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుగానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed