Asian Games : ఫిఫ్టీ కొట్టి టీ షర్ట్ ఎత్తి చూపిన తిలక్ వర్మ.. ట్విస్ట్ ఇదే..?

by Sathputhe Rajesh |
Asian Games : ఫిఫ్టీ కొట్టి టీ షర్ట్ ఎత్తి చూపిన తిలక్ వర్మ.. ట్విస్ట్ ఇదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ క్రికెట్‌లో యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ తనదైన ఆటతీరుతో అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించారు. ఇక తాజాగా ఆసియా గేమ్స్‌లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ చేరువ కాగానే తిలక్ వర్మ ఏ మాత్రం తడబడకుండా సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇక తన ఆనందాన్ని సరికొత్త రీతిలో ప్రదర్శించాడు. ఏడమ వైపు రిబ్స్ భాగంలో ఉన్న తన తల్లిదండ్రుల టాటూను ప్రేక్షకులకు చూపుతూ సంబరాలు చేసుకున్నాడు. ముంబాయి బార్న్ క్రికెటర్ ఈ ఒక్క మూమెంట్‌తో తల్లిదండ్రుల పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నాడు. ఇక, ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అఫ్గానిస్తాన్‌తో నేడు తలపడనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్‌ను అఫ్గానిస్తాన్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story