ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం

by Harish |
ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : చైనా వేదికగా ఆదివారం ప్రారంభమైన హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. టోర్నీ చరిత్రలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనాను 3-0 తేడాతో చిత్తు చేసి టోర్నీలో సూపర్ బోణీ చేసింది. మ్యాచ్‌లో మొదటి నుంచి చివరి వరకూ భారత్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. 14వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత 27వ నిమిషంలో ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఫస్టాఫ్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇక, మూడో క్వార్టర్‌లో అభిషేక్ చేసిన గోల్‌ చేయడంతో 3-0తో మ్యాచ్‌‌ను పూర్తిగా చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత భారత్ పెనాల్టీ కార్నర్లను భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. అదే సమయంలో చైనా చేసిన గోల్ ప్రయత్నాలను తిప్పికొట్టింది. దీంతో చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయతీరాలకు చేరింది. సోమవారం రెండో గ్రూపు మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed