Asia Cup 2023: చెలరేగిన శ్రీలంక స్పిన్నర్స్.. భారత్ అలౌట్

by Vinod kumar |   ( Updated:2023-09-15 14:39:52.0  )
Asia Cup 2023: చెలరేగిన శ్రీలంక స్పిన్నర్స్.. భారత్ అలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా సూపర్‌-4 లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 213 పరుగులకు కుప్పకూలింది. లంక బౌలర్లు దునిత్ వెల్లలాగే, చరిత అసలంక విజృంభించడంతో భారత్ బ్యాటర్స్ తేలిపోయారు. భారత్ బ్యాటర్‌లో.. రోహిత్‌ శర్మ (53) హాఫ్‌ సెంచరీ చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (33), కేఎల్‌ రాహుల్‌ (39) పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్స్ శుభ్‌మన్‌ గిల్‌ (19), విరాట్‌ కోహ్లి (3), హార్దిక్‌ (5), జడేజా (4) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్‌ (10-1-40-5) ఐదు వికెట్లు తీయగా.. చరిత అసలంక (4), మహీశ తక్షణ 1 వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed