Asia Cup 2023: సెంచరీలతో చెలరేగిన బాబర్‌, ఇఫ్తికార్‌.. పాక్‌ భారీ స్కోర్‌

by Vinod kumar |
Asia Cup 2023: సెంచరీలతో చెలరేగిన బాబర్‌, ఇఫ్తికార్‌.. పాక్‌ భారీ స్కోర్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌ 2023లో భాగంగా ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో ఇవాళ జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్లు శతకాల మోత మోగించారు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు శతకంతో కదంతొక్కగా.. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇఫ్తికార్‌ అహ్మద్‌ సుడిగాలి శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ 44 పరుగులతో రాణించగా.. ఫకర్‌ జమాన్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (5), అఘా సల్మాన్‌ (5) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో.. సోంపాల్‌ కామీ 2 వికెట్లు పడగొట్టగా.. కరణ్‌ , సందీప్‌ లామిచ్చేన్‌ తలో వికెట్‌ తీశారు.

Advertisement

Next Story

Most Viewed