Asia Cup 2023: వన్డేల్లో అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌లో తొలి ప్లేయర్‌గా..

by Vinod kumar |
Asia Cup 2023: వన్డేల్లో అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌లో తొలి ప్లేయర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా రెండు సార్లు హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ముజీబ్‌ నిలిచాడు. ఆసియాకప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌ వికెట్‌గా ఔటైన ముజీబ్‌.. ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఆఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ 45 ఓవర్‌ వేసిన తస్కిన్ అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి మరి ముజీబ్‌ హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో కూడా ముజీబ్‌ హిట్‌ వికెట్‌గానే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బంగ్లా చేతిలో 89 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ ఓటమి పాలైంది.

Advertisement

Next Story