Virat Kohli: విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత.. ఆరో క్రికెటర్‌గా..

by Vinod kumar |
Virat Kohli: విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత.. ఆరో క్రికెటర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్స్) 300 విజయాల్లో భాగమైయాడు. ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 12) జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించడం ద్వారా కోహ్లి ఈ ఘనతను సాధించాడు. అయితే ఈ ఘనతను కోహ్లీకి ముందు కేవలం ఐదుగురు మాత్రమే సాధించారు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అత్యధికంగా 377 విజయాలు సాధించగా.. ఆ తర్వాత లంక లెజెండ్‌ మహేళ జయవర్ధనే (336), క్రికెట్‌ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ (307), సౌతాఫ్రికన్‌ జాక్‌ కల్లిస్‌ (305), లంక లెజెండ్‌ కుమార సంగక్కర (305) ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed