Asia Cup 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక యువ స్పిన్నర్‌..

by Vinod kumar |
Asia Cup 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక యువ స్పిన్నర్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో 20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే రికార్డు సృష్టించాడు. లంక తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. దునిత్‌ 20 ఏళ్ల 246 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. దీనికి ముందు ఈ రికార్డు చరిత బుద్ధిక పేరిట ఉంది.

బుద్ధిక 2001లో జింబాబ్వేపై 21 ఏళ్ల 65 రోజుల వయసులో 5 వికెట్ల ఫీట్ సాధించాడు. ఇతనికి ముందు తిసార పెరీరా (21 ఏళ్ల 141 రోజులు), ఉవైస్‌ కర్నైన్‌ (21 ఏళ్ల 233 రోజులు) లంక తరఫున పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దునిత్‌ (10-1-40-5) ఐదు వికెట్ల ఘనత సాధించాడు. దునిత్‌ స్పిన్ మాయాజాలానికి భారత్‌ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. 47 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం మొదలైంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం 47 ఓవర్లకు భారత్ స్కోరు 197/9. సిరాజ్ (2), అక్షర్ పటేల్ (15) పరుగులతో ఉన్నారు.


Advertisement

Next Story

Most Viewed