IND vs SL: టీమిండియా చెత్త రికార్డు.. 49 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..

by Vinod kumar |
IND vs SL: టీమిండియా చెత్త రికార్డు.. 49 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ పదికి పది వికెట్లు స్పిన్నర్లకే సమర్పించుకుంది. 49 ఏళ్ల భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో బ్యాటర్లందరూ ఇలా స్పిన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. యువ స్పిన్ ఆల్‌రౌండర్‌ దునిత్‌ వెల్లలాగె (40/5) టీమిండియా టాప్‌ ఆర్డర్‌ను పెవిలియన్‌కు పంపాడు.

తర్వాత అసలంక (4/18) విజృంభించగా.. మహీశ్‌ తీక్షణ చివరి వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఆలౌట్ చేయడం ద్వారా శ్రీలంక అరుదైన రికార్డును అందుకుంది. వన్డేల్లో వరుసగా 14 సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే 13 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న శ్రీలంకకు భారత్‌ చేతిలో పరాభావం ఎదురైంది.

Advertisement

Next Story

Most Viewed