Ashes Series 3rd Test: చెలరేగిన బ్రూక్‌.. ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై ఇంగ్లండ్‌ గెలుపు..

by Vinod kumar |   ( Updated:2023-07-13 06:08:22.0  )
Ashes Series 3rd Test: చెలరేగిన బ్రూక్‌.. ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై ఇంగ్లండ్‌ గెలుపు..
X

దిశ, వెబ్‌డెస్క్: Ashes Series 3rd Testలో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌, రెండో సెషన్‌లోనే ఆటను ముగించింది. హ్యారీ బ్రూక్‌ (75) అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లండ్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు.

ఆఖర్లో క్రిస్‌ వోక్స్‌ (32 నాటౌట్‌), మార్క్‌ వుడ్‌ (16 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. నాలుగో రోజు ఆటలో మిచెల్‌ స్టార్క్‌ (5/78) బెదరగొట్టినా.. బ్రూక్‌, వోక్స్‌, వుడ్‌ల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 5.. కమిన్స్‌, మార్ష్‌ తలో వికెట్‌ పడగొట్టారు. యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌‌కి తొలి విక్టరీ.. వరుస రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్‌ విజయం సాధించగా, కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ సత్తా చాటింది.

Advertisement

Next Story

Most Viewed