Ashes 2023: ఆసీస్‌కు బిగ్ షాక్.. యాషెస్ సిరీస్‌ నుంచి స్టార్ స్పిన్నర్ ఔట్..

by Vinod kumar |
Ashes 2023: ఆసీస్‌కు బిగ్ షాక్.. యాషెస్ సిరీస్‌ నుంచి స్టార్ స్పిన్నర్ ఔట్..
X

లండన్ : యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టులో నెగ్గిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ కాలికి తీవ్ర గాయమైంది. దాంతో మైదానం వీడాడు. అయితే, స్కానింగ్ అనంతరం కర్ర సాయంతో ఆసిస్ రెండో ఇన్నింగ్స్‌లో తప్పనిసరి పరిస్థితుల్లో చివరి వికెట్‌గా బ్యాటింగ్‌ చేశాడు.

లియోన్ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, అతను కోలుకునేందుకు సమయం పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దాంతో మిగతా సిరీస్‌కు అతను దూరమైనట్టు ప్రకటించింది. లియోన్ స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీని జట్టులోకి తీసుకున్నట్టు తెలిపింది. భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాడ్ మర్ఫీ రాణించిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్నది. ఈ నెల 6 నుంచి లీడ్స్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed