జడేజా ఖాతాలో మరో రికార్డ్..

by Mahesh |
జడేజా ఖాతాలో మరో రికార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. మరో మైలురాయిని అందుకున్నారు. టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 2,500 పరుగులు, 250 వికెట్లు సాధించిన భారత ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరుగుతున్న టెస్ట్‌లో మొదటి రోజు మూడు వికెట్లు తీసిన జడేజా.. 250 వికెట్ల మార్కును అందుకున్నాడు. కాగా జడ్డు.. కేవలం 62 టెస్టు మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించాడు. అలాగే టెస్టుల్లో 2,500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కాగా గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ (65 టెస్టులు) పేరిట ఉంది.

Advertisement

Next Story