- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో రికార్డు సృష్టించడానికి అడుగుదూరంలో నీరజ్ చోప్రా..
న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో గురువారం జరగబోయే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ పోటీల్లో నీరజ్ చోప్రా గెలిస్తే మరో చారిత్రాత్మక రికార్డును సృష్టించనున్నాడు. డైమండ్ లీగ్‌లో గెలిస్తే ట్రోఫీతోపాటు 30,000 యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. అలాగే 2023లో హంగేరీలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.
గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు నీరజ్ దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మైదానంలో రీ ఎంట్రీ ఇచ్చిన నీరజ్ చరిత్ర సృష్టించాడు. తన ఒక్క త్రోతో 3 అద్భుతాలు చేశాడు. డైమండ్ లీగ్ మీట్‌లో లాసాన్ స్టేజ్ టైటిల్‌ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు బద్దలు కొట్టాడు. దీంతో జ్యూరిచ్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. అలాగే ఈ చారిత్రాత్మక త్రోతో వచ్చే ఏడాది హంగేరీలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు కూడా అర్హత సాధించాడు. దీంతో ఈ అర్హత సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ నిలిచాడు. నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే 89.08 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరాడు. ఇది అతని కెరీర్‌లోనే మూడో అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.
Also Read : చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..