అంబటి రాయుడుకి అన్యాయం చేశారు.. అనిల్ కుంబ్లే షాకింగ్ కామెంట్స్

by Vinod kumar |
అంబటి రాయుడుకి అన్యాయం చేశారు.. అనిల్ కుంబ్లే షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అంబటి రాయిడు 2019 ప్రపంచకప్‌ ఎంపిక కాకపోవడంపై టీమ్ ఇండియా మాజీ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రాయుడు 2019 ప్రపంచకప్‌ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. సెలక్షన్‌ కమిటీతో పాటు జట్టు మెనెజ్‌మెంట్‌ చేసిన పెద్ద తప్పుగా కుంబ్లే అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడిని నాలుగో స్థానం కోసం సిద్ధం చేయగా.. ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగించిందని ఐపీఎల్ ఫైనల్ తర్వాత మాట్లాడుతూ అనిల్ కుంబ్లే చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి లపై అనిల్ కుంబ్లే తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఐపీఎల్‌-2023 ఫైనల్‌ అనంతరం తన ఐపీఎల్‌ కెరీర్‌కు అంబటి రాయుడు ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రాయుడు ఆరు టైటిల్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టైటిల్స్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున సాధించగా.. మరో మూడు టైటిల్స్‌ సీఎస్‌కే తరపున గెలుచుకున్నాడు. భారత తరఫున రాయుడు కేవలం 55 వన్డేలు, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు.

2018 నుంచి 2019 మార్చి మధ్య కాలంలో టీమ్ ఇండియా వన్డే టీమ్ నాలుగో స్థానంలో రాయుడు నిలకడగా రాణించాడు. వరల్డ్ కప్‌లో ఆ స్థానం రాయుడిదే అని అందరూ భావించారు. కానీ టోర్నీ కోసం టీమ్ ఎంపిక సమయంలో రాయుడు స్థానంలో ఆల్ రౌండర్ కావాలంటూ విజయ్ శంకర్‌ను తీసుకున్నారు. ఆ నాలుగో నంబర్‌లో సరైన ప్లేయర్ లేకపోవడం 2019 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా కొంప ముంచింది.

Advertisement

Next Story