నన్ను బలి పశువు చేయాలని చూస్తున్నారు.. స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..

by Vinod kumar |
నన్ను బలి పశువు చేయాలని చూస్తున్నారు.. స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్ : వెస్టిండీస్ కోచ్ ఫిల్‌ సిమ్మన్స్‌, సీనియర్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోషల్​మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. అయితే ఇటీవల సిమ్మన్స్.. "జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తున్నారు" అని అన్నాడు. దీనికి ఆండ్రూ రస్సెల్ ట్విట్టర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తనను బలిపశువును చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తారని ముందే ఊహించానని చెప్పాడు. "ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకెప్పుడో తెలుసు. అయితే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే మేలు" అని ట్వీట్ చేశాడు. విండీస్‌ జట్టుతో ఆడాలని, రెండు ప్రపంచకప్‌లను గెలవాలని ఉంది. అయితే అలాంటి అవకాశం ఉందని మాత్రం చెప్పలేను అంటూ ఆండ్రూ రస్సెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు నా వయస్సు 34 ఏళ్లు. ఇప్పటికీ విండీస్‌ కోసం ప్రపంచకప్‌లను గెలిపించాలని భావిస్తున్నా అని ఆండ్రూ రస్సెల్‌ వివరించాడు.

Advertisement

Next Story

Most Viewed