Andhra Premier League 2023: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే..

by Vinod kumar |   ( Updated:2023-08-11 10:30:28.0  )
Andhra Premier League 2023: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ముహూర్తం ఖరారైంది. ఈ టోర్నీ ఆగస్టు 16 నుంచి 27వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం ఆరు టీమ్స్ ఆ టోర్నీలో తలపడతాయి. ఈ టోర్నీ మ్యాచులన్నీ కూడా విశాఖపట్టణంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతాయి. ఈ టీ20 టోర్నమెంట్‌లో ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్.. మొత్తం ఆరు టీమ్స్ తలపడతాయి.

ఈ ఆరు జట్లు ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడతాయి. ఆ తర్వాత ఎలిమినేటర్ (ఆగస్టు 25), క్వాలిఫైయర్-1 (ఆగస్టు 25), క్వాలిఫైయర్-2 (ఆగస్టు-26) జరుగుతాయి. ఆగస్టు 27న టోర్నీ ఫైనల్ ఉంటుంది. ఈ టోర్నీ వేలానికి ముందే ఉత్తరాంధ్ర, బెజవాడ జట్లు తమ కీలక ప్లేయర్లయిన కేఎస్ భరత్, రికీ భుయ్‌ తదితరులను రిటైన్ చేసుకున్నాయి. టీమిండియా బ్యాటర్ హనుమ విహారి ఈ లీగ్‌లో అత్యధికంగా రూ.6.6 లక్షల ధర పలికాడు. అతన్ని రాయలసీమ కింగ్స్ కొనుగోలు చేసింది.

ఏపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే..

ఆగస్టు 16, 5 PM, కోస్టల్ రైడర్స్ vs బెజవాడ టైగర్స్

ఆగస్టు 17, 10 AM, వైజాగ్ వారియర్స్ vs గోదావరి టైటాన్స్

ఆగస్టు 17, 3 PM, రాయలసీమ కింగ్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్

ఆగస్టు 18, 12 PM, కోస్టల్ రైడర్స్ vs వైజాగ్ వారియర్స్

ఆగస్టు 18, 5 PM, బెజవాడ టైగర్స్ vs గోదావరి టైటాన్స్

ఆగస్టు 19, 10 AM, బెజవాడ టైగర్స్ vs రాయలసీమ కింగ్స్

ఆగస్టు 19, 3 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs కోస్టల్ రైడర్స్

ఆగస్టు 20, 10 AM, ఉత్తరాంధ్ర లయన్స్ vs వైజాగ్ వారియర్స్

ఆగస్టు 20, 3 PM, గోదావరి టైటాన్స్ vs రాయలసీమ కింగ్స్

ఆగస్టు 21, 12 PM, బెజవాడ టైగర్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్

ఆగస్టు 21, 5 PM, రాయలసీమ కింగ్స్ vs వైజాగ్ వారియర్స్

ఆగస్టు 22, 12 PM, గోదావరి టైటాన్స్ vs కోస్టల్ రైడర్స్

ఆగస్టు 22, 5 PM, వైజాగ్ వారియర్స్ vs బెజవాడ టైగర్స్

ఆగస్టు 23, 12 PM, కోస్టల్ రైడర్స్ vs రాయలసీమ కింగ్స్

ఆగస్టు 23, 5 PM, ఉత్తరాంధ్ర లయన్స్ vs గోదావరి టైటాన్స్

ఆగస్టు 25, 12 PM, ఎలిమినేటర్

ఆగస్టు 25, 5 PM, క్వాలిఫైయర్ 1

ఆగస్టు 26, 5 PM, క్వాలిఫైయర్ 2

ఆగస్టు 27, 5 PM, ఫైనల్

Advertisement

Next Story

Most Viewed