- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారిస్ ఒలింపిక్స్‌కు అనంత్‌జీత్, రైజా ధిల్లాన్ క్వాలిఫై
దిశ, స్పోర్ట్స్ : షూటింగ్‌లో భారత్‌కు మరో రెండు పారిస్ ఒలింపిక్ బెర్త్‌లు ఖాయమయ్యాయి. కువైట్‌లో జరుగుతున్న ఏషియన్ షాట్‌గన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్, రైజా ధిల్లాన్ స్కీట్ ఈవెంట్‌లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌కు ఏషియన్ షాట్‌గన్ చాంపియన్‌షిప్ అర్హత టోర్నీ. ఈ టోర్నీలో వ్యక్తిగత విభాగంలో టాప్-2లో నిలిచిన షూటర్లు ఒలింపిక్ బెర్త్‌లను సాధించొచ్చు. పురుషుల స్కీట్ విభాగంలో అనంత్‌జీత్ సింగ్ తృటిలో స్వర్ణ పతకం చేజార్చుకున్నాడు. 56 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు. గోల్డ్ మెడల్ సాధించిన చైనీస్ తైపీ షూటర్ లీ మెంగ్ యువాన్(57) కంటే అనంత్‌జీత్ ఒక్క పాయింట్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. మహిళల స్కీట్ విభాగంలో రైజా ధిల్లాన్ సైతం రజతం దక్కించుకుంది. 52 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత షూటర్ మహేశ్వరి చౌహాన్ 43 స్కోరుతో కాంస్యం గెలుచుకుంది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత షూటర్ల సంఖ్య 19కు చేరింది. అంతేకాకుండా, స్కీట్ పురుషుల, మహిళల విభాగంలో ఒలింపిక్స్‌లో భారత్ బెర్త్‌లు సాధించడం ఇదే తొలిసారి.