- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డు నమోదు.. 33 బంతుల్లోనే శతకం బాదిన అనామక బ్యాట్స్‌మెన్
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే మరో సంచలన రికార్డు నమోదైంది. క్రికెట్ పసికూన జట్టు నమీబియా బ్యాట్స్‌మెన్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త రికార్డును సృష్టించాడు. దీంతో అంతర్జాతీయ పురుషుల క్రికెట్ విభాగంలో వేగవంతంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో నికోల్ వీర విహారం చేశాడు. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడుతూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్సింగ్స్ 11వ ఓవర్‌లో 3 కీలక వికెట్లు కోల్పోయాక బ్యాటింగ్ వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ ఏకంగా 11 ఫోర్లు, 8 సిక్సర్లతో బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే, గతంతో ఈ రికార్డు నేపాల్ బ్యాట్స్‌మెన్ కుశాల్ పేరిట ఉండేది. గతేడాది ఏషియన్ గేమ్స్‌లో మంగోలియాపై కుశాల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు.