- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్‌కు మహిళల డబుల్స్ జోడీ..
కాలిఫోర్నియా: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ సెమీస్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో వరల్డ్ నం.7 జంటకు షాకిచ్చిన గాయత్రి జోడీ.. ప్రీ క్వార్టర్స్‌లో మాజీ చాంపియన్లను చిత్తు చేసి సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత షట్లర్లు 21-14, 18-21, 21-12 తేడాతో చైనాకు చెందిన లీ వెన్ మెయి-లియు జువాన్ జువాన్‌పై విజయం సాధించారు. గంటకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం భారత ద్వయానిదే. తొలి గేమ్‌లో ప్రారంభంలో 7-7తో ప్రత్యర్థి పోటీనిచ్చేందుకు ప్రయత్నించగా.. గాయత్రి జోడీ వరుసగా పాయింట్లు గెలిచి శుభారంభం చేసింది.
రెండో గేమ్ మాత్రం నువ్వానేనా అన్నట్లు సాగింది. ప్రారంభంతో భారత జంటదే లీడ్ కొనసాగినా.. ఆ తర్వాత చైనా జోడీ బలంగా పుంజుకుంది. 15-15తో స్కోరు సమమైన సమయంలో ప్రత్యర్థులు వరుసగా పాయింట్లు గెలుచుకోవడంతో రెండో గేమ్ చేజారింది. దాంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు దారితీసింది. ఆఖరి గేమ్‌లో గాయత్రి జోడీ పుంజుకున్న తీరు అద్భుతం. పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ చైనా జంటకు ఎక్కడా అవకాశాలు ఇవ్వకుండా లీడ్‌ను పెంచుకుంటూ వెళ్లి మూడో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. దాంతో వరుసగా రెండో ఎడిషన్‌లో గాయత్రి-జాలీ జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. నేడు జరిగే సెమీస్‌లో భారత ద్వయం సౌత్ కొరియాకు చెందిన లీ సో హీ-బేక్ హా-నా జోడీతో తలపడనున్నది.