- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అజ్ఞాతవాసాన్ని వీడిన ఆఫ్గాన్ క్రికెటర్లు

- 3 ఏళ్ల తర్వాత మ్యాచ్ ఆడనున్న మహిళా క్రికెటర్లు
- మహిళా క్రికెట్‌పై తాలిబాన్ నిషేధం
- ఆస్ట్రేలియా పారిపోయిన 21 మంది క్రికెటర్లు
దిశ, స్పోర్ట్స్:
ఆఫ్గానిస్తాన్ నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలో శరణార్థులుగా తలదాచుకుంటున్న 21 మంది మహిళా క్రికెటర్లు గురువారం మ్యాచ్ ఆడనున్నారు. ఆస్ట్రేలియాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నఈ క్రికెటర్లు మూడేళ్ల తర్వాత తమ సహచరులను కలుసుకోనున్నారు. మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్‌లో క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలవెన్ జట్టుతో ఆఫ్గానిస్తాన్ విమెన్స్ ఎలెవెన్ తలపడనుంది. 2021లో తాలిబాన్లు ఆఫ్గానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత మహిళలు క్రికెట్ ఆడటంపై నిషేధం విధించారు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన కొంత మంది సహకారంతో వారు దేశం విడిచి వెళ్లిపోయారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా, మెల్‌బోర్న్‌లో ఉన్న వేర్వేరు క్రికెట్ క్లబ్‌లలో వీరు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నారు.అయితే మూడేళ్ల తర్వాత వీరంతా కలిసి ఒక మ్యాచ్ ఆడుతుండటం గమనార్హం. ఆఫ్గానిస్తాన్‌లో ఉన్న లక్షలాది మంది మహిళలకు తమ హక్కులు నిరాకరించబడ్డాయి. వారందరి తరపున మేముప్రాతినిథ్యం వహించబోతున్నామని క్రికెటర్ ఫిరోజా అమీరీ అన్నారు. తాలిబాన్లు తమను బెదిరించడంతో కుటుంబంతో సహా పాకిస్తాన్ పారిపోయాను. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు అమీరీ పేర్కొన్నారు. గురువారం నాటి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ ఎలెవెన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న నహిదా సపన్.. తమకు సపోర్ట్ చేస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు తెలిపారు. క్రికెటర్లకు తమ పేరుతో కూడిన టీమ్ జెర్సీని అందించడం ఒక శక్తివంతమైన సందర్భం. క్రికెటర్ల స్థితప్రజ్ఞతకు తాను చాలా సంతోషిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ నిక్ హాక్లీ అన్నారు. ఆఫ్గానిస్తాన్ మహిళ క్రికెటర్ల గురించి ఐసీపీతో కూడా చర్చలు జరుపుతున్నాము. అయితే ఈ మ్యాచ్ అందులో తొలి అడుగు అని హోక్లే అభిప్రాయపడ్డారు.