చెలరేగిన అఫ్గాన్ బౌలర్లు.. యూఏఈపై టీ20 సిరీస్ కైవసం

by Swamyn |   ( Updated:2024-01-03 06:22:15.0  )
చెలరేగిన అఫ్గాన్ బౌలర్లు.. యూఏఈపై టీ20 సిరీస్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య యూఏఈతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక ఆఖరి టీ20లో నెగ్గి 2-1తో సిరీస్‌ను దక్కించుకుంది. షార్జా వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈపై 4 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 126 పరుగులు చేసింది. అఫ్గాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ 4 వికెట్లతో బెంబేలెత్తించగా.. కైస్ అహ్మద్ 3 వికెట్లు, అజ్మతుల్లా 2 వికెట్లతో సత్తాచాటారు. దీంతో యూఏఈ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. కెప్టెన్, ఓపెనర్ ముహమ్మద్ వసీమ్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ జట్టు 18.3 ఓవర్లలోనే ఛేదించింది. 6 వికెట్లను కోల్పోయి 128 పరుగులు చేసింది. హజ్మతుల్లా(36), గుర్బాజ్(20), ఇబ్రహీం జద్రాన్(23) కీలక పరుగులు జోడించగా.. నజీబుల్లా జద్రాన్(28 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రెండో టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన యూఏఈ 11 పరుగుల తేడా ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed