18 ఏళ్ల ధోనీ రికార్డును బద్దలుకొట్టిన అఫ్గాన్ బ్యాటర్..

by Vinod kumar |
18 ఏళ్ల ధోనీ రికార్డును బద్దలుకొట్టిన అఫ్గాన్ బ్యాటర్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్‌పై అఫ్గానిస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల యువ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అత్యధిక వ్యక్తిగత (151) స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో అతడు భారత మాజీ ప్లేయర్.. ధోనీ రికార్డును అధిగమించాడు. పసికూన అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 3-0 తేడాతో.. క్లీన్​స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో అఫ్గాన్ మూడు మ్యాచ్‌ల్లో భంగపడ్డప్పటికీ.. ఆ జట్టులో యువ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 21 ఏళ్ల ఈ బ్యాటర్ రెండో మ్యాచ్‌లో పాక్‌పై 100 స్ట్రైక్​రేట్‌తో 151 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

ఈ క్రమంలో పాక్‌పై అత్యధిక పరుగులు చేసిన వికెట్​కీపర్‌గా గుర్బాజ్ నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. ఎంఎస్ ధోనీ 2005లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులు చేసి సత్తా చాటాడు. దాదాపు 18 ఏళ్లుగా ధోనీ పేరిట ఉన్న ఈ రికార్డును గుర్బాజ్ తాజాగా బద్దలుకొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed