- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ ఇవ్వనున్న విధ్వంసకర ఆటగాడు
దిశ, వెబ్‌డెస్క్: క్రీడాభిమానులకు సౌతాఫ్రికా స్టార్ బ్యాట్‌మెన్ ఏబీ డివిల్లియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ చరిత్రలో డివిల్లియర్స్ చేసిన విధ్వంసాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో పదేళ్ల పాటు ఆర్సీబీ జట్టు తరపున ఆడి.. భారత క్రీడాభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. అయితే, అనూహ్యంగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కూ గుడ్‌బై చెప్పి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. తాజాగా.. ఇటీవల ట్విట్టర్ వేదికగా ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఏబీ శుభవార్త చెప్పారు. ఆర్సీబీ జట్టులో తిరిగి చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే, ఈసారి కనిపించేది ఆటగాడిగా కాదని స్పష్టం చేశారు. దాదాపు పదేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు సేవలు అందించిన తన మాజీ ఆటగాడికి పెద్ద బాధ్యతను ఇవ్వగలదని నమ్ముతున్నారు అభిమానులు. దీంతో ఏబీ డివిలియర్స్ చాలా కాలం పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అనుబంధం కలిగి ఉన్నాడు. కానీ, ఇప్పుడు అతను మరొక పాత్రలో కనిపించవచ్చని తెలుస్తోంది.