WTC Final మ్యాచ్‌లో ఆసీస్‌కు వాళ్లిద్దరితోనే కష్టం.. ఆరోన్ ఫించ్

by Vinod kumar |   ( Updated:2023-06-05 12:23:13.0  )
WTC Final మ్యాచ్‌లో ఆసీస్‌కు వాళ్లిద్దరితోనే కష్టం.. ఆరోన్ ఫించ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆసీస్, భారత్ జట్టు గట్టిగా రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్‌ను ఇబ్బందిపెట్టే టీమ్ ఇండియా ప్లేయర్లు ఎవరో ఆ టీమ్ ప్లేయర్ ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. ఆసీస్ బ్యాటర్లకు ప్రధాన సమస్య భారత్ వద్ద ఉన్న కొత్త బంతి బౌలర్లు మహమ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ అని ఫించ్ అభిప్రాయపడ్డాడు. 'కొత్త బంతితో బౌలింగ్ చేసే మహమ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.. వాళ్లిద్దరూ కొన్నేళ్ల నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ మంచి సీమ్‌తో ఫ్లాట్ వికెట్లపై కూడా నాణ్యమైన బ్యాటర్లను ఔట్ చేస్తాడు' అని ఫించ్ అన్నాడు. ఇప్పటి వరకు సిరాజ్ 18 టెస్టులు ఆడగా.. వీటిలో 31.29 సగటుతో 47 వికెట్లు తీశాడు. అంతేకాదు, ఆసీస్‌పై ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడిన అతను 2.64 సగటుతో 14 వికెట్లు తీసుకున్నాడు.

మరో పేసర్ షమీ గురించి మాట్లాడుతూ.. 'షమీ గురించి ఏం చెప్పినా తక్కువే. షమీ వేసే ప్రతి డెలివరీలో మంచి సీమ్‌తో పాటు మూవ్‌మెంట్ కూడా చూపిస్తున్నాడు. వీళ్లిద్దరూ కనుక వార్నర్, ఖవాజా వికెట్లను త్వరగా తీసుకుంటే ఆసీస్ కష్టాల్లో పడుతుంది. అలాగే బంతి కొత్తగా ఉన్నప్పుడే లబుషేన్, స్టీవ్ స్మిత్‌ను ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే.. అక్కడే విజేత ఎవరో డిసైడ్ అయిపోయే ఛాన్స్ ఉంది' అని ఫించ్ వివరించాడు.

Read more:

WTC Final : కొత్త జెర్సీతో ఫొటోలకు ఫోజులిచ్చిన టీమ్ ఇండియా ప్లేయర్లు

'అతడు కోలుకుంటే.. అజింకా రహానేకి తుది జట్టులో చోటు ఉంటుందా?'.. ఎమ్మెస్కే ప్రసాద్

Advertisement

Next Story