టెస్ట్ క్రికెట్‌లో రికార్డు సృష్టించిన భారత్

by Mahesh |
టెస్ట్ క్రికెట్‌లో రికార్డు సృష్టించిన భారత్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ మరో రికార్డును సృష్టించింది. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో మొదటి ఆరు వికెట్లకు భారత్ 50+ భాగస్వామ్యాలను నమోదు చేసింది. దీంతో ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్ 74 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఛెతేశ్వర్ పుజారా, గిల్ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, విరాట్ కోహ్లీ-గిల్ (58), రవీంద్ర జడేజా-కోహ్లీ (64), కోహ్లీ-కె ఎస్ భరత్ (84), కోహ్లీ-అక్సర్ పటేల్ (162) ఉన్నారు. కాగా ఇలా వరుసగా మొదటి ఆరు వికెట్లకు 50+ భాగస్వామ్యాలను నమోదు చేయడం ఇదే తొలిసారి.

Advertisement

Next Story