స్కూల్లో టీచర్ కామ క్రీడలు.. గేమ్స్ పేరుతో పోర్న్ వీడియోలు చూపించి

by Anukaran |   ( Updated:2021-07-24 03:31:34.0  )
స్కూల్లో టీచర్ కామ క్రీడలు.. గేమ్స్ పేరుతో పోర్న్ వీడియోలు చూపించి
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు పెద్దలు. గురువు తర్వాతే దేవుడు అని అర్ధం. సమాజంలో ఎలా బతకాలి..? ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలి అనేది గురువులే నేర్పిస్తారు. కానీ, ఈ టీచర్ మాత్రం గురువు అన్న పదానికే మచ్చగా మిగిలాడు. బాలికలను లైంగికంగా వేధిస్తూ, కామ క్రీడలకు స్కూల్ నే వేదికగా మార్చుకున్నాడు. ఆటల పేరుతో బాలికలకు పోర్న్ వీడియోలు చూపించి, లైంగికంగా వేధిస్తున్న ఓ స్పోర్ట్స్ టీచర్ బాగోతం కేరళలో వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. కోజికోడ్‌లోని కత్తిప్పారా హోలీ ఫ్యామిలీ హైయర్ సెకండరీ స్కూల్లో కొందన్ చెర్రీకి చెందిన వీటీ మనీష్. స్పోర్ట్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. బాలికలను రోజు సాయంత్రం ఆడుకోవడానికి గ్రౌండ్ కి తీసుకువెళ్లి వారితో డ్రిల్ల్ చేయించేవాడు. ఈ నేపథ్యంలోనే ఆ కామాంధుడు కన్ను ఒక బాలిక మీద పడింది. గేమ్స్ పేరుతో ఆమెను రహస్య ప్రదేశాల్లో తాకడం, ఆమెకు పోర్న్ వీడియోలను చూపించడం చేస్తుండేవాడు. తనకు ఇష్టంలేదని విద్యార్థిని ఎంత చెప్పినా వినకుండా బెదిరించి వీడియోలను చూపించేవాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలికను స్కూల్ పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లో ఆటవస్తువులు తీసుకురావాలని చెప్పి తీసుకెళ్లాడు.

అక్కడ బాలికను లైంగికంగా వేధించడంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో మనీష్ అక్కడి నుంచి జారుకున్నాడు. అప్పటికే బాలిక ఏడుస్తూ ఉండడంతో మిగతా టీచర్లు ఏం జరిగిందని అడగగా బాలిక మొత్తం విషయం బయటపెట్టింది. దీంతో టీచర్ పై స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు నమోదు అయ్యాకా ఇంకొంతమంది బాలికలు సైతం తమను కూడా టీచర్ వేధించాడని ముందుకు రావడం గమనార్హం. అయితే ఇలా చేయడం మనీష్ కి కొత్తేమి కాదని, అంతకుముందు ఉన్న స్కూల్ లో కూడా బాలికలను లైంగికంగా వేధించడంతో అతను జైలుకి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.

Read more news: ఇద్దరు యువతుల ప్రేమాయణం.. హిజ్రాగా మారి మరీ..

Advertisement

Next Story

Most Viewed