- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వారియర్ల తర్వాత వారికి టీకా
న్యూఢిల్లీ: కరోనా వారియర్ల తర్వాత టోక్యో ఒలింపిక్ క్రీడలకు వెళ్లే భారత క్రీడాకారులకు టీకా వేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కరోనా వారియర్లందరికీ టీకా పంపిణీ ముగిసిన తర్వాత క్రీడాకారులకు టీకా వేయాలని భావిస్తున్నామని తెలిపారు. అందులోనూ ముఖ్యంగా ఈ సారి టోక్యోలో నిర్వహించే ఒలింపిక్ క్రీడలకు హాజరవుతున్న అథ్లెట్లకు వేయాలని యోచిస్తున్నామని చెప్పారు. సమాజాన్ని రక్షించే కరోనా వారియర్లకు ముందుగా టీకా పంపిణీ పూర్తి కావాలని అన్నారు.
వారి తర్వాతే అథ్లెట్లకు అని తెలిపారు. టోక్యో వెళ్లే క్రీడాకారులను టీకా పంపిణీ కార్యక్రమంలో ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖకు క్రీడా శాఖ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. క్రీడాకారులకు ప్రాధాన్యతనివ్వాలని ఇది వరకే విజ్ఞప్తి చేశామని, సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఇటీవలే క్రీడా శాఖ తెలిపింది. వారు స్పందించిన వెంటనే ప్రక్రియను మొదలు పెడదామని పేర్కొంది. ఒలింపిక్స్‌కు ఇంకా సమయమున్నదని, దీనిపై సంబంధిత అన్ని శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించింది.