ఉమ్మి వేసిన ఇద్దరి‌‌పై కేసు నమోదు

by Shyam |

దిశ, వరంగల్: లాక్‌డౌన్ నేపథ్యంలో‌ వరంగల్ కూరగాయల మార్కెట్‌లో బహిరంగంగా ఉమ్మి వేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు మిల్స్ కాలనీ సీఐ నరేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రోడ్లపై ఉమ్మి వేసే వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీరిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ వివరించారు.

Tags: spit, 2mem case filed, warangal, corona, lockdown.

Advertisement

Next Story