- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Film Hero’s Divorce : డబ్బుకొట్టు.. పెళ్లాన్ని వదిలి పెట్టు! విడాకులకు రూ.కోట్లు కుమ్మరిస్తున్న హీరోలు

డబ్బు
డబ్బు
డబ్బు..
కరెన్సీ కట్టలు ఉంటే ఏం ఏం చేయొచ్చు. విలాస వస్తువులు కొనొచ్చు.. లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఖరీదైన భవనాలను సైతం సొంతం చేసుకోవచ్చు. కానీ డబ్బు పెట్టి బంధాలను తెంచుకోవచ్చా? అవుననే అంటుంది సినీ ఇండస్ట్రీ(Film industry). నచ్చని బట్టలను మార్చినట్టే భార్యలను మార్చేస్తున్నారు కొంతమంది హీరోలు. సినిమా ప్రాజెక్టులకు సైన్ చేసినట్టే విడాకుల (Divorce) పత్రాలపై సంతకాలు చేస్తూ మూడుముళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నారు. రెమ్యునరేషన్(Remuneration) మాదిరిగానే కోట్లు కుమ్మరించి లైఫ్ పార్ట్‌నర్(Life partner)కు శుభం కార్డు వేస్తున్నారు. ఇలా తమ హోదాకు తగ్గట్టే డివోర్స్‌ను కాస్ట్లీగా మారుస్తున్నారు. విలాసాలకు ఖర్చు పెట్టినట్టే విడిపోవడానికి ఎంత ధనాన్నైనా ధారాదత్తం చేస్తున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu film industry)లో మాత్రమే కాదు.. తమిళ, కన్నడ, హిందీ.. భాష ఏదైనా వందల కోట్ల భరణం చెల్లిస్తూ ఆమెతో బంధం వద్దంటున్నారు. - సుధారాణి
ఏడేళ్ల ప్రేమ ‘బంధం’కు తెర
టాలీవుడ్‌లో నాగచైతన్య(Naga Chaitanya) - సమంత(Samantha).. వీరిద్దరు జంటగా నటించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. ఆ మూవీ షూటింగ్‌లో వీరి ప్రేమ స్టార్ట్ కాగా.. ఏకంగా ఏడేళ్లు లవ్‌లో ఉన్నారు. ఆ తర్వాత సామ్, చైతు 2017లో పెద్దలు సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి బంధంలో ఎంతోకాలం నిలవలేదు. కొన్ని బయటకు తెలియని కారణాల చేత 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ జంట విడాకులు, భరణం గురించి చాలా చర్చ సాగింది. ఈ బ్రేకప్ అనంతరం అక్కినేని కుటుంబం(Akkineni family) నుంచి భారీ మొత్తాన్ని సమంత అందుకుందని గుసగుసలు వినిపించాయి. అయితే స్వయం కృషితో ఎదిగిన సామ్ తన మాజీ భర్త చైతూ నుంచి ఏమీ ఆశించలేదని కూడా కొన్ని మీడియాల్లో కథనాలొచ్చాయి. కానీ భరణం(alimony), విడాకులపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
తెలుగు ఇండస్ట్రీలో సంచలనమే..
ఇక పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. 1997లో వైజాగ్‌కి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2007లో అధికారికంగా విడాకులు ఇచ్చి విడిపోయారు. అనంతరం 2009లో రేణూ దేశాయ్(Renu Desai)ని వివాహం చేసుకుని.. 2012లో విడాకులు ఇచ్చారు. 2013లో అన్నా లెజినోవా(Anna Lezhinova) మెడలో తాళికట్టాడు. అయితే.. గతేడాది ఏపీలో జరిగిన ఎలక్షన్ల టైమ్‌లో వైసీపీకి చెందిన వారు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. వీటిపై స్పందించిన పవన్ కల్యాణ్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అని విమర్శిస్తే ఊరుకునేది లేదని.. నేను ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. విడాకుల సమయంలో తన మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు మిగిలిన ఆస్తి ఇచ్చినట్టు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా వారిద్దరితో తనకు వర్క్ అవుట్ కాకపోవడంతోనే విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నట్లు ఆ సందర్భంలోనే తేల్చేశారు.
ప్రభుదేవా రాంగ్ స్టెప్
కోలీవుడ్ స్టార్ హీరో, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా(Choreographer Prabhudeva) ఓ హీరోయిన్ ప్రేమలో పడి తన భార్య రమాలతకు విడాకులు ఇచ్చారు. 2009లో హీరోయిన్ నయనతార (Nayanthara)తో ప్రేమలో పడ్డ ప్రభుదేవా ఆమెను పెళ్లి చేసుకోవడానికి 2011లో భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ సమయంలో తన మొదటి భార్య రమాలతకు భరణంగా 25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు, ఖరీదైన కార్లు భరణంగా ఇచ్చారని టాక్. ఇక పెళ్లి వరకు వెళ్లిన ప్రభుదేవా, నయనతార జంట అనివార్యకారణాలతో విడిపోయారు.
భరణం.. రూ.300 కోట్లు
హృతిక్ రోషన్(Hrithik Roshan)-సుసానే ఖాన్ (Susanne Khan)2000లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి హ్రీహాన్, హ్రిధాన్ ఇద్దరు కుమారులు. అయితే, 14 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట 2014లో డివోర్స్ తీసుకున్నారు. ఇక హృతిక్ రోషన్‌కు వేరే హీరోయిన్స్‌తో అక్రమ సంబంధాలు ఉన్నాయనే కారణంగా ఆమె విడాకులు కోరినట్లు సమాచారం. అయితే ఈ విడాకుల వ్యవహారంలో ఏకంగా ఆమె రూ. 400 కోట్లు అడగ్గా.. చివరికి, రూ. 300 కోట్లకు భరణం సెట్ అయినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. కాగా.. ప్రజెంట్ హృతిక్ రోషన్ సింగల్ గానే ఉంటున్నాడు.
పది కోట్లతో ఫటాఫట్
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan)1986లో రీనా దత్(Reena Dutt)ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కారణం ఏదైనా 2000 లో విడాకులు తీసుకొని ఇద్దరూ విడిపోయారు. ఆ సమయంలోనే విడాకుల భరణం కింద రూ. 10 కోట్ల వరకు రీనా దత్ తీసుకున్నారని సమాచారం.
నిలవని ప్రేమ పెళ్లి
1991 లో హీరోయిన్ అమృత సింగ్(Amrita Singh)ని, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్(Sarah Ali Khan), ఇబ్రహీం (Ibrahim) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక 2004లో మనస్పర్థలు రావడంతో 13 ఏళ్ల వివాహ బంధానికి తెర దించుతూ విడాకులు తీసుకున్నారు. ఈమెకు సైఫ్ నుండి భరణం రూపంలో బాగానే ఆస్తులు దక్కాయని బాలీవుడ్(Bollywood)లో అప్పట్లో వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అయ్యాయి.
ముచ్చటగా మూడో పెళ్లి
1996 లో తన మొదటి భార్య రీచాశర్మ మరణించిన తర్వాత 1998 లో రియా పిళ్లైని సంజయ్ దత్ (Sanjay Dutt) వివాహం చేసుకున్నారు. పదేళ్ల కాపురం తర్వాత 2008లో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. దీనితో 2008లో విడాకులు తీసుకున్నారు. ఇక సంజయ్ దత్ రియాపిళ్లైకు భరణం కింద 8 కోట్ల రూపాయలు ఇచ్చారట. అదే ఏడాది సంజయ్ దత్ మాన్య దత్‌ని మూడో వివాహం చేసుకున్నారు.
25 ఏళ్ల వివాహ బంధానికి బీటలు
మలైకా ఆరోరా(Malaika Arora), అర్బాజ్ ఖాన్(Arbaaz Khan).. 1998 డిసెంబర్ 12న వివాహం చేసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత 2017లో వీరు విడిపోయారు. డైవర్స్ సెటిల్‌మెంట్ కింద మలైకా ఆరోరా రూ.10-15 కోట్లు అందుకున్నట్లు DNA పత్రిక ప్రత్యేక కథనంలో వెల్లడించింది.
వీళ్లేం తక్కువ కాదు..
- - విలక్షణ నటుడిగా పేరున్న కమల్ హాసన్ (Kamal Haasan)ఇద్దరిని పెళ్లి చేసుకోని విడాకులు ఇచ్చాడు. నటి గౌతమి(Gautami)తో సహజీవనం(coexistence) చేసి విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు.
- - టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ప్రముఖ నిర్మాత డీ రామానాయుడి(Produced D Ramanaidu) కూతుర్ని మొదటి వివాహం చేసుకోని విడాకులు ఇచ్చారు. ఆ తర్వాతనే నటి అమలను పెళ్లి చేసుకున్నారు.
- - మరో అక్కినేని హీరో సుమంత్ (Sumanth) నటి కీర్తిరెడ్డి (Kirti Reddy)ని వివాహం చేసుకోని రెండేళ్లకే డివోర్స్ తీసుకున్నాడు.
- - మంచు హీరో మనోజ్ (Manchu Manoj) మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులతో ఎండ్ కార్డ్ పలికారు.
- - విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakashraj), సీనియర్ నటుడు శరత్ బాబు(Sharath Babu), తమిళ నటి, అప్పటి టాలీవుడ్ హీరోయిన్ రాధిక(Radhika), సింగర్ సునీత (Sunitha) ఇలా తెలుగు ఇండస్ట్రీకి చెందిన అగ్రతారలు మొదటి భాగస్వామికి విడాకులు ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆ సమయంలో వీళ్లంతా భారీగానే భరణం చెల్లించిన వాళ్లే.
అభిమానం తలకెక్కితే..
సినీ నటులకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వాళ్లంతా తమ అభిమాన హీరోలను ఆరాధ్యంగా భావిస్తుంటారు. వాళ్లనే అనుకరిస్తుంటారు. ఇటీవల ఓ మూవీని చూసి, దానినే ఫాలో అవుతూ మర్డర్ చేశాడో వ్యక్తి. స్మగ్లింగ్ చేసే వాళ్లు పుష్ప మూవీని అనుసరిస్తూ కొత్త కొత్త మార్గల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇలా హీరోలు, హీరోయిన్లు ధరించే కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, నడవడికను అనుసరిస్తుంటారు. మరి ఇలానే విడాకులను అనుకరిస్తే వివాహ వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. డబ్బులు ఉంటే చాలు డివోర్స్ ఇవ్వొచ్చు అనే ఆలోచన హీరోల నుంచి నేర్చుకుంటే కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉంటుంది. హీరోలు అభిమానులకు ఆదర్శంగా ఉంటేనే ఫ్యాన్స్ చెడు మార్గం వైపు పయణించకుండా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read more..: సినీ ఫీల్డ్‌లో డివోర్స్ ట్రెండ్!