- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లీష్ రాక వేలకోట్లు నష్టపోతున్న పాకిస్తాన్
దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలో మనకి ఏడువింతలున్నాయన్న సంగతి తెలిసిందే. కానీ మనం తెలుసుకునే ఈ వింత 8 వింతకి ఏమాత్రం తీసిపోదనే చెప్పాలి. ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటని అనుకుంటున్నారా? అదే పింక్ హిమాలయన్ సాల్ట్. హిమాలయం అంటే సాధారణంగా గుర్తొచ్చేది ఎత్తైన మంచుకొండలు. పర్వత శ్రేణులు. కొండ చరియలు మాత్రమే. కానీ ఇప్పుడు మీకు పరిచయం అయ్యే ఈ పింక్ హిమాలయన్ సాల్ట్ టోటల్ డిఫరెంట్. అవును మీరు ఊహించింది నిజమే. పేరులోనే సగం మ్యాటర్ అర్ధమైపో ఉంటుంది కదా. ఈ హిమాలయన్ ఉప్పు పాకిస్తాన్ పంజాబ్ లో, భారత్ లో హిమాలయ పర్వత శ్రేణుల్లో లభ్యమవుతుంది. ఖనిజ లవణాలతో వెలికి తీయబడుతుంది. ఈ ఉప్పు హైలైట్ ఖనిజ లవణాల కారణంగా గులాబీ రంగులో ఉంటుంది. అందుకే దీన్ని పింక్ సాల్ట్ అనే పేరొచ్చింది. సాధారణ ఉప్పు టేబుల్ స్పూన్ కంటే ఐదు రేట్లు ఈ హిమాలయన్ సాల్ట్ పనిచేస్తుంది. అంతేకాదండయే ఈ పింక్ సాల్ట్ లో 85 రకాల మినరల్స్ ఉన్నాయి. అయోడిన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం అభివృద్ధితో పాటు చిన్నపిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా అంతటి విశిష్టమైన ఈ పింక్ సాల్ట్ నిధులున్నా పాకిస్తాన్ వేలకోట్ల నష్టపోతుంది. అందుకు కారణం ఇంగ్లీష్ భాష రాకపోవడమే.
అలెగ్జాండర్ గుర్రం బుస్సీ
చిన్నతనంలోనే తెలిసిన ప్రపంచాన్ని ఆక్రమించుకున్న మాసిడోనియన్ వీరుడు ఇతను. శత్రువు ఎలాంటి వాడైనా ఎంత వాడైనా యుద్ధంలో ఎలా ఓడించాలో తెలిసిన గ్రీకు వీరుడే… ది గ్రేట్ అలెగ్జాండర్. అయితే 320 సంవత్సరంలో ప్రపంచ దేశాలపై వరుసగా దండయాత్ర చేస్తున్న అలెగ్జాండర్ తన గుర్రం బుస్సీ , సైన్యంతో కలిసి పాకిస్తాన్ లోని జీలం జిల్లాలోకి ప్రవేశించాడు. అక్కడ యుద్ధం జరిగే సమయంలో రెస్ట్ తీసుకునేందుకు జీలం జిల్లాలోని పంజాబ్ ప్రాంతంలో ఆగిపోయాడు. ఆ సమయంలో అలెగ్జాండర్ గుర్రం బుస్సీ ఆహారం కోసం ప్రయత్నిస్తుండగా పింక్ సాల్ట్ ఉన్న గనుల్ని తన నాలుకతో చప్పరించింది. అంతే పింక్ సాల్ట్ టేస్ట్ తో ఫిదా అయిన బుస్సీ అక్కడే ఉండిపోవడంతో అనుమానం వచ్చిన అలెగ్జాండర్ టెస్ట్ లు చేయగా.., సుమారు 3,398 కిలోమీటర్ల మేర పింక్ సాల్ట్ గనులున్నట్లు గుర్తించాడు. నాటి స్థానిక అలెగ్జాండర్ సైనికులు పింక్ సాల్ట్ గనుల విషయాన్ని రహస్యంగా ఉంచారు. కానీ 1872 లో బ్రిటిష్ సామ్రాజ్యంలో మైనింగ్ ఇంజనీర్ డాక్టర్ హెచ్. వార్త్ పింక్ సాల్ట్ గనుల తవ్వకంపై నిర్మాణం చేపట్టారు.
స్వాతంత్ర్యం తరువాత, పాకిస్తాన్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గనుల్ని స్వాధీనం చేసుకుంది. ఇది ఇప్పటికీ పాకిస్తాన్ లో అతిపెద్ద పింక్ సాల్ట్ గనులుగా ప్రసిద్ధికెక్కాయి. సంవత్సరానికి 350,000 టన్నులకు పైగా ఉత్పత్తి అవుతుంది. 99% స్వచ్ఛమైన సైంధవ లవణం (హాలైట్). 82 మిలియన్ టన్నుల నుండి 600 మిలియన్ టన్నులకంటే ఎక్కువగా పింక్ సాల్ట్ నిక్షేపాలున్నాయి. 200 అంతకంటే ఎక్కువ ఉత్పత్తుల్లో ఉపయోగించే పింక్ సాల్ట్ ద్వారా పాక్ ప్రభుత్వం వేలకోట్లను అర్జించాల్సి ఉంది. కానీ ఇంగ్లీష్ భాష రాకపోవడం వల్ల టెక్నాలజీతో గనుల్ని వెలికి తీయలేకపోవడం, ఇతర దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహించలేకపోవడం ఆ దేశ పాలకుల అసమర్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇంగ్లీష్ రాకపోవడం వల్లే వేలకోట్ల నష్టం
పాక్ ప్రభుత్వం ప్రతీ రోజూ వెయ్యి టన్నుల పింక్ సాల్ట్‌ను వెలికి తీసి ట్రక్కుల ద్వారా ఆ దేశం అంతా రవాణా చేస్తుంది. పాక్ తరువాత భారత్ కు 23శాతం ఎగుమతి చేస్తుంది. అదే 23శాతం సాల్ట్ ను ఇతర దేశాలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటుంది. అయితే అదే సమయంలో పింక్ సాల్ట్ ను మరిన్ని దేశాలకు రవాణా చేసేలా తమదేశానికి చెందిన వారికి ఇంగ్లీష్ భాషపై నైపుణ్యం లేదని, అందువల్ల రవాణా సాధ్యం కావడం లేదని పాకిస్తాన్ కు చెందిన ఆర్ఎమ్ సాల్ట్ ఎక్స్ పోర్ట్ కంపెనీ సీఈఓ వాకస్ పాంజ్వానీ, హిమాలయన్ డెకర్ ఇంటర్నేషనల్ సంస్థ యజమానికి మహమ్మద్ ఇమ్రాన్ తెలిపారు.
హెల్త్ కేర్ రంగంలో
గనుల నుంచి వెలికి తీసిన పింక్ సాల్ట్ ను నేరుగా ప్రభుత్వమే విదేశాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ భాషానైపుణ్యం లేకపోవడం వల్ల వేలకోట్లు నష్టపోతుంది. అంతేకాదు స్థానిక కంపెనీలకు కట్టబెడుతుంది. ప్రభుత్వం నుంచి సాల్ట్ ను కొనుగోలు చేసిన వ్యాపారులు యుఎస్, యుకె, మరియు స్పెయిన్ వంటి పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడ హెల్త్ కేర్ ప్రాడక్ట్ లలో ఈ పింక్ సాల్ట్ ను ఉపయోగం ఎక్కువగా ఉంది.